top of page
Writer's picturejanardhan520

సంద్రం చెప్పిన సంగతులు

అది ఒక అందమైన సాయంత్రం, అలా సముద్రపు ఒడ్డున చల్లటి పిల్లగాలికి నడుస్తూ నడస్తూ అలసిపోయి ఒకచోట కూర్చుని ఆ సముద్రాన్ని, ఆ ఎగసిపడే అలలను అలా చూస్తూ వుండిపోయాను. సుమారు రెండు గంటలపాటు అలాగే చూస్తూ వున్నాను, ఇంతలో సముద్రం లోంచి ఒక ఆత్మ వచ్చి "ఎందుకు గంటల తరబడి నావంకే అలాగే చూస్తూ వున్నావ్?" అని అడిగింది, అప్పుడు నేను "నువ్వు మాత్రం తక్కువా, ఏదో సాధించాలని ఇలా ముందుకు వస్తున్నావ్ అంతలోనే మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నావ్, నీకు అలసట రాదా, నీకింకో పని లేదా, కొంచెం కుదురుగా వుండలేవా" అని అడిగాను, అప్పుడా ఆత్మ మెల్లగా నవ్వి ఇన్ని రోజులు నన్ను ఎవ్వరూ అడగని ప్రశ్న అడిగావు, చాలా మంచి ప్రశ్న కూడా! చెప్తా విను. ముందు నాకు కుదురు లేదా అని అడిగావ్ కదా, నేను కుదురుగా వుంటే నాకు ఒక చెరువుకు తేడా ఏముంది, నేనలా కుదురుగా వుంటే నువ్వు వస్తావా నన్ను చూడడానికి! ఇంక అలసట రాదా అన్నావ్ కదా, మనకి ఇష్టమైన పని చేస్తుంటే కష్టం, అలసట వుండవు కదా! ఇంక నీకు పని లేదా అన్నావ్ కదా, ఇదే నా పని, నాకిష్టమైన పని "అలసిపోయి వచ్చినవారికి సేద తీరుస్తాను, సరదాగా వచ్చిన వారికి సంతోషాన్నిస్తాను, బాధతో వచ్చినవారి కష్టాన్ని పంచుకుంటాను, పొట్ట చేత పట్టుకుని వచ్చిన వారికి బ్రతుకుతెరువు చూపిస్తాను, చిన్నపిల్లలను ఆడిస్తాను, ప్రేమికులను కవ్విస్తాను, మొత్తంగా సంతోషంతో వచ్చినవారి సంతోషాన్ని రెట్టింపు చేస్తాను, బాధతో వచ్చినవారి బాధను సగం తగ్గిస్తాను" ఇదే నా పని, కానీ నేను కుదురుగా వుంటే ఇంతమందికి సేవ చెయ్యలేను కదా! అంది ఆ సముద్రం. నేను మెల్లగా నవ్వుతూ, నేను సరదాగా అన్నాను, నువ్వెంటో నాకు తెలుసు, ఒక ప్రేమికుడిగా, ఒక ప్రకృతి ప్రేమికుడిగా, ఒక రచయితగా, ఒక పిల్లవాడి తండ్రిగా, అసలు ఒక మనిషిగా నీ విలువేంటో నాకు బాగా తెలుసు, బాధపెట్టి వుంటే మన్నించు అన్నాను, తను కూడా మెల్లగా నవ్వి చల్లగాలి రూపంలో నన్ను తడిమి మన్నించినట్లు తెలిపింది. నేనెప్పుడు వచ్చినా ఇలాగే వచ్చి కబుర్లు చెప్పాలని ఆ సముద్రం దగ్గర మాట తీసుకుని, తను చేస్తున్న సేవకి మనస్పూర్తిగా అభినందన చెప్పి, తనదగ్గర సెలవు తీసుకుని, సంతోషంగా అక్కడినుంచి బయలుదేరాను.

23 views0 comments

Recent Posts

See All

జనాభా

సాయంత్రం అలా పార్క్ లో నడుస్తూ వుండగా నా ఫ్రెండ్ అన్నాడు "ఈ పార్క్ లో నడవడానికి కూడా సరిగా ప్లేస్ లేదు, జనాభా రోజు రోజుకూ...

Success, Failure

Success, Failure, అదృష్టం, దురదృష్టం, స్నేహం, సహాయం, కృతజ్ఞత.. వీటన్నింటినీ కలిపి ఒక్క వాక్యం లో చెప్పడానికి చాలా ఆలోచించి ఇలా రాశాను.. ...

డబ్బు

నా అనుభవం తో చెప్తున్నా!! మనం సంపాదించే డబ్బు.. దాచిపెడితే భయాన్ని ఇస్తుంది, ఖర్చు చేస్తే సుఖాన్ని ఇస్తుంది, కావాల్సిన వాల్లకిస్తే గౌరవం...

コメント


bottom of page