ఒకరోజు ఒక తీగ వచ్చి చెట్టు ని ఇలా అడిగింది, నేను ఎదగడానికి సహాయం చేస్తావా అని, ఆ చెట్టు సంతోషంగా ఒప్పుకుంది. అతి తక్కువ కాలంలోనే ఆ తీగ బాగా ఎదిగింది, దాన్ని చూసి ఆ చెట్టు కూడా చాలా ఆనందపడింది. కానీ ఆ తీగ గర్వంతో తనకు ఆసరా ఇచ్చిన చెట్టు తలమీదకు ఎక్కి ఆ చెట్టు మీద సూర్యరశ్మి పడకుండా చేసి ఆ చెట్టు ఎదుగుదలను అడ్డుకోవాలని అనుకుంది. ఆ చెట్టు మాత్రం స్థిరంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. అలా కాలం సాగుతుండగా ఒకరోజు పెద్ద గాలి వానా వచ్చి ఆ తీగ పైభాగం అంతా ఎగిరిపోయింది, భయంతో ఒనికిపోతున్న ఆ తీగతో చెట్టు ఇలా అంది, భయపడకు మిత్రమా నన్ను గట్టిగా పట్టుకో నేను చూసుకుంటాను అని. ఆ తీగ అలాగే చేసి ఆ గండం నుంచి బయట పడింది.
ఈ కళికాలం లో మనిషి కూడా తీగ లాగా ఆలోచిస్తూ తన తోటివరిపై స్వార్థబుద్ధి చూపిస్తున్నాడు. కానీ చెట్టులాగా స్థిరంగా నిలబడిన మనిషి మాత్రం ఎంతమందికైనా ఆసరా ఇస్తూ గొప్పవాడు అవుతాడు.
Comments