ఎడారి లాంటి నా జీవితంలో తుఫానులా వచ్చావు, దోసిలి పట్టి తాగేలోపే మాయమయ్యావు..
చీకటి నిండిన బతుకులో పౌర్ణమిలా వచ్చావు, వెన్నెల్లో తడిసేలోపే అమావాస్య ఉంటుందని గుర్తుచేశావు..
నదిలో కొట్టుకుపోతున్న ఈ ప్రాణాన్ని పైకి లేపావు, గట్టు మీద నిలబడే లోపే సముద్రంలో తోసేశావు..
ఏమైపోయావు!! ఎక్కడికెళ్లావు!!
మోడువారిన ఈ జీవితంలో వసంతమై మళ్లీ రాలేవా!!
చీకటి చీల్చే లేలేత సూర్యకిరణమై వెలుగులు నింపలేవా!! ప్రియా!!
Comments