అమావాస్య నిండిన జీవితంలో
దీపావళి తెచ్చావు..
ఓటమితో కృంగిపోయిన బ్రతుక్కి
విజయదశమి నిచ్చావు..
నలుపు తెలుపు ల జీవితానికి
రంగులద్దిన హోళీ వయ్యావు..
కష్టాలతో నిండిన జీవితంలో
సుఖ సంతోషాల సంక్రాంతిని తెచ్చావు..
మోడుబారిన ఈ బ్రతుకులో
కొత్త చిగురులు తెచ్చిన ఉగాదిలా అడుగు పెట్టావు..
పండుగ ఎరుగని ఈ అనాథ జీవితాన్ని ప్రతిరోజూ పండుగ చేసిన
ప్రియా, నీకు ఏ పండుగ శుభాకాంక్షలు తెలుపను..
Comments