ఓ సీతా!
నువ్వు పర్వతమైతే నేను మేఘమౌతా, నీవైపే పయనించి, నీపైనే వర్షించి, నీమీదే ప్రవహించి, నీలో ఐక్యమౌతా..
నువ్వు సాగరమైతే నే పారే నదినౌతా, నీకోసం పరుగు తీసి, నీవైపే ఉరకలేసి, నీలో కలిసిపోతా..
నువ్వొక పుస్తకమైతే నే సిరానౌతా, నీ పేజీలపై అక్షరమవుతా, ఒక అందమైన కవితనౌతా..
నువ్వు పాలైతే నే నీళ్లవుతా, నువ్వు చెట్టైతే నే పిట్టనవుతా, నువ్వేదైనా నే నీలో ఐక్యమౌతా..
నా ప్రేమకి కదలక ఒక శిలలా వున్నావంటే నేనందులో శిల్పాన్నవుతా..
Comments