చాలా రోజుల తర్వాత ఒక స్నేహితున్ని కలిశాను, office విషయాలు, family విషయాలు ఇంకా సినిమాలు, రాజకీయాలు ఏవేవో మాట్లాడుతున్నాం కానీ తను చాలా frustrated గా కనిపిస్తున్నాడు. ఏమయింది రా అలా వున్నావ్ అని అడిగాను, ఏం లేదు రా బాగానే వున్నా అన్నాడు, అలా కాదు రా నాకు తెలుస్తుంది ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు వున్నావ్ అని అడిగాను, అప్పుడు వాడన్నాడు "frustrated with this routine work and routine life రా, laptop, mobile, tv, work, office, house, పిల్లలు, banks, loans, బరువులు, బాధ్యతలు.. అదే routine life రా, యాంత్రిక జీవితం గడుపుతున్నాము రా, నాకు మళ్లీ మన బాల్యానికి వెళ్లిపోవాలని వుంది, ఏ బాధ్యతలు ఏ ఆలోచనలు లేకుండా, ఏ స్వార్థం లేకుండా పల్లెలో గోలీలు ఆడుకుంటూ, చెట్లు ఎక్కుతూ, పచ్చని తోటల్లో తిరుగుతూ, బావుల్లో ఈదులాడుతూ, రేగుపల్లు, చింతకాయలు ఏరుకుని తింటూ, చీకటి పడగానే ఏ ఆలోచన లేకుండా పడుకోగానే పట్టే స్వచ్ఛమైన నిద్ర.. మళ్లీ ఆ బాల్యం కావాలి రా!" అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు, ఒక్కసారి నా బాల్యం కళ్ళముందు కనిపించింది. వెంటనే తేరుకుని ఇలా అన్నాను "నువ్వు బాల్యానికి వెళ్లిపోతే మళ్లీ మీ నాన్న నీకోసం కష్టపడలా, నీకో న్యాయం, మీ నాన్నకో న్యాయమా.. మన చిన్నప్పుడు మనకు బరువులు బాధ్యతలు లేవు గానీ మన అమ్మా నాన్నలు మన కోసం ఎంత కష్టపడ్డారో నీకు గుర్తు లేదా, ఎన్ని రోజులు ఒక్క పూట భోజనం చేసి పడుకున్నారో..కాబట్టి life లో ఇది ఒక phase, మనం accept చెయ్యాలి,
కష్టపడాలి, అలా అని జీవితం అంటే కష్టం మాత్రమే కాదు కదా, మనం చేసే పనిలో, మన పిల్లల్లో చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవాలి, ఏదో సాధించాలి అని ముందుకెళ్లాలి, అదే జీవితం. ఇంక నీ సమస్య కి permanent solution చెప్పలేకపోయినా temporary గా ఒక solution ఇవ్వగలను, ఒక వారం రోజులు leave పెట్టి, మీ పిల్లాణ్ణి తీసుకుని నువ్వు పుట్టి పెరిగిన మీ పల్లె కి వెళ్ళండి, mobile complete గా switch off చేసి నీ పిల్లాడి తో గోళీలు ఆడించు, చెట్లు ఎక్కించు, బావిలో ఈతలాడించు, రేగిపళ్ళు, చింత పళ్ల రుచి చూపించు, మట్టి లో ఆడితే జబ్బు చేస్తుందని చెప్పకుండా నువ్వు మర్చిపోయిన మట్టి వాసన వాడికి రుచి చూపించు, మొత్తంగా నీ బాల్యాన్ని మీ వాడిలో చూసుకో !!" అని చెప్పాను. వాడు కూడా సరే అన్నట్లు తలూపాడు.
నాకు తెలిసి మన కర్తవ్యం మనం చేస్తూ, కష్టాలొచ్చినప్పుడు ఎదుర్కొంటూ, సుఖాలను కోరుకుంటూ, చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోడమే జీవితం..
We have to accept every phase of life, We have to fight with every day of life,
At the same time, we have to find happiness in every moment of life..
మీe పోస్ట్‌లో నా స్నేహితుడిని చూశాను. తెలుగులో పెట్టినందుకు చాలా థాంక్స్ బయ్యా.