top of page
Writer's picturejanardhan520

ఏం సాధించాను?

రిటైర్ అయ్యిన కొన్ని సంవత్సరాలకు,

మార్గశిర మాసం, డిసెంబర్ నెల,

నా తోట లో ఉన్న ఇంటిలో,

సాయంత్రం 4.30 గంటలకు,

చల్లటి సాయంత్రం, కానీ మనసెందుకో బాధగా ఉంది..


టీ కప్పు తో వచ్చిన తను "ఏంటండీ నిన్నటినుండి ఏదో ఆలోచిస్తూనే వున్నారు, ఏమయ్యింది" అని అడిగింది.

ఏం లేదే, ఇన్ని సంవత్సరాల మన జీవిత ప్రయాణం లో ఏం సాధించామా అని ఆలోచిస్తున్నాను, ఎంత ఆలోచించినా మనస్సు నువ్వు ఏమీ చెయ్యలేదు అనే చెప్తోంది. చదువు, జాబ్, పెళ్లి, సంపాదన, పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్లు ఇవే కనిపిస్తున్నాయి కానీ నువ్వు ఏం సాధించావ్ అని మనస్సు అడుగుతోందే..

అప్పుడు తను "అందుకే అండి ఇక్కడ వద్దు వెళ్లి పిల్లల దగ్గర ఉందాం, అక్కడ ఐతే ఇలాంటి ఆలోచనలు రాకుండా చిన్న పిల్లలతో సమయం గడపొచ్చు అంటే వినరు కదా" అని అంది.

వద్దే ఆ సిటీ లో నేను ఉండలేను, అప్పుడంటే సంపాదన కోసం, పిల్లల చదువులకోసం ఇష్టం లేకపోయినా సిటీ లో వున్నాం, ఇప్పుడు కూడా అంటే నా వాళ్ళ కాదు, ఐనా ఈ మొక్కలు చెట్లు మాత్రం మన పిల్లలు స్నేహితులు కాదా? అన్నాను. తను విసుగ్గా ఒక నవ్వు నవ్వి లేవబోతుంటే కాసేపు కూర్చోవే అన్నాను, తను ఆగిపోయింది.

ఈ మాట, అదే "నువ్వు ఏం సాధించావ్" అనే ప్రశ్న ను నన్ను నేను చాలాసార్లు అడిగి చూసుకున్నా, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యినప్పుడు, జాబ్ చేస్తున్నపుడు, సంపాదన లో సమయం లేకుండా గడుపుతున్నపుడు, ఇలా చాలాసార్లు, అప్పుడు ఏదో ఒకటి చెప్పి మనస్సును మళ్ళించా కానీ ఇప్పుడు రెండు రోజులు అవుతున్నా మనస్సు కుదుట పడట్లేదు, ఏం సాధించావ్ అని మనస్సు అడుగుతూనే ఉంది, ఏమ్ సాధించామే ?

అప్పుడు తను "ఉమ్ మీతో కూర్చుంటే ఇలా వేదాంతం చెప్తూనే వుంటారు గానీ నాకు పని ఉంది వెళ్ళాలి, మీ ఫోన్ ఇలా ఇవ్వండి, ఒక కాల్ చెయ్యాలి" అని ఫోన్ తీసుకెళ్లింది.


అదే రోజు రాత్రి 9.30 గంటలకు

నేను పుస్తకం చదువుతుండగా, గ్లాసు లో మజ్జిగ తెచ్చి "ఏంటి, ఈరోజు కూడా నిద్ర పట్టట్లేదా, నాకైతే నిద్ర వస్తోంది, మజ్జిగ తాగి, పడుకునే ముందు మీ ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ఒకసారి చూసుకోండి" అని చెప్పి తను పడుకుంది. పుస్తకం మధ్యలో ఆపడం ఇష్టం లేక ఉమ్ అన్నాను. ఒక 30 నిముషాల తర్వాత పుస్తకం పక్కన పెడుతూండగా ఫోన్ లో ఏదో నోటిఫికేషన్ వస్తే ఫోన్ తీసుకున్నాను. అది చూసుకుని ఫోన్ పక్కన పెట్టబోతుండగా తన మాట గుర్తొచ్చి కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేశాను.


ఓపెన్ చెయ్యగానే A_ తో చాల పేర్లు వస్తున్నాయ్.

"నాకు మొదటినుంచి ఒక అలవాటు ఉండేది, నాకు సాయం చేసిన వాళ్ళు, ఏదయినా నేర్పించిన వాళ్ళు, గొప్ప సలహాలు ఇచ్చిన వాళ్ళ పేర్లను A_ తో prefix చేసి save చేసుకోవడం. అలాగే మోసం చేసిన వాళ్ళు, నష్టం చేసిన వాళ్ళు, నమ్మకద్రోహం చేసిన వాళ్ళు, కొంచెం కూడా ధర్మ ప్రవర్తన లేనివాళ్ళ పేర్లు X_ అని prefix చేసి save చేసుకోవడం అలవాటు. X_ నుంచి A_ కి వెళ్లిన పేర్లు X_ ను remove చేసిన పేర్లు వున్నాయి కానీ A_ నుంచి X_కి వెళ్లిన పేర్లు లేవు. ఎందుకంటే ఒకసారి సాయం చేసిన వాడు తర్వాత నమ్మకద్రోహం చేసినా కూడా వాడు చేసిన సహాయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి అని అనుకుంటాను నేను"

అలా scroll చేస్తుంటే A_ తో చాలా పేర్లు వస్తున్నాయ్, so మనకు ఎంతో మంది సాయం చేస్తే గానీ మన గమ్యాన్ని చేరుకోలేము, మన కలలు నెరవేర్చుకోలేము. అసలు ఎవరి సహాయం, సలహాలు లేకుంటే మనిషి జీవితం fulfill కాదు కదా..

ఆ పేర్లు చూస్తుంటే వీళ్లందరి వల్లే కదా ఈరోజు ఇలా వున్నాను అనిపించింది.

ఇంకా అలా scroll చేస్తూ ఉంటే మన జీవన ప్రయాణం లో కలిసిన ఎందరో వ్యక్తులు కళ్ల ముందు కనిపిస్తున్నారు.


అలా కింద వరకూ వచ్చాక X_ తో కొన్ని పేర్లే వున్నాయి, మొదట్లో X_ తో చాలా పేర్లు ఉండేవి, కానీ ఏదో ఒక దశ లో ఆ సమయం లో వాళ్ళు అలా చేయవలసి వచ్చిందేమో, లేదా నా తప్పు కూడా కొంత ఉందేమో అని అనుకుని X_ తీసేస్తూ వచ్చాను , అందుకే ఇప్పుడు ఏ మూడో నాలుగో మిగిలాయి, అవి కూడా జీవితం లో అధర్మం, మోసం తప్ప ధర్మం, సహాయం తెలియని వ్యక్తులు, మరి అలాంటి వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఎందుకు అంటే, మన ప్రయాణం లో అలాంటి వ్యక్తులు లేకున్నా కొన్నిసార్లు మన పనులు, భాధ్యతలు పూర్తి కావు కదా!


ఇంకా కిందకు scroll చేస్తే కొత్తగా Z_ తో కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి, ఏంటబ్బా నా కాంటాక్ట్స్ ఎలా మారిపోయాయి అని doubt వచ్చి "ఏమే నా కాంటాక్ట్స్ మార్చింది నువ్వేనా" అని అడిగాను, కానీ అప్పటికే తను నిద్రపోయింది. అరవయ్యేళ్లు వస్తున్నా దీనికి పడుకోగానే నిద్ర పడుతుంది, అదృష్టవంతురాలు..


మరుసటి రోజు ఉదయం 7 గంటలకు,

టీ తాగుతున్నప్పడు,

ఎందుకే నా ఫోన్ లో కాంటాక్ట్స్ మార్చేశావ్? ఆ Z_ అంటే అర్థం ఏమిటే అని తనని అడిగాను.

అప్పుడు తను "A_ అంటే మీకు సహాయం చేసిన వాళ్ళు కదా, Z_ అంటే మీ నుంచి సహాయం పొందిన వాళ్ళు. మీరు రెండు రోజులనుంచి బాధపడుతున్నారు కదా ఏం సాధించాను నేను అని, అందుకే ఆలా చేశాను, మీకు సాయం చేసిన వారి వల్ల మీరు ఎలా వృద్ధిలోకి వచ్చారో, అలాగే మీరు చేసిన సహాయం వల్ల, మీరిచ్చిన సలహా వల్ల బాగుపడిన వాళ్ళు, మీ నుంచి నేర్చుకున్న వాళ్ళ పేర్లను ఆలా Z_ అని పెట్టాను, అదేనండి మీరు సాధించినది. మనం ఏదో సాధించాలి అంటే మనం దేవుళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, బాగా డబ్బున్నోళ్ళం కావాల్సిన పని లేదు కదండీ, మనకున్నదానిలో కొంత ఇతరులకు సహాయం చేస్తూ, వాళ్ల అభివృద్ధిని కోరుకుంటూ, వీలైతే కొంత సమయాన్ని కూడా సమాజం కోసం కేటాయిస్తే వచ్చే తృప్తే మనం సాధించే విజయం అండి, కాబట్టి మనం సాధించామనే నేననుకుంటున్నాను." అని చెప్పింది.

తను ఇంత బాగా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు, కానీ చాలా బాగా చెప్పింది.

మనస్సు తేలిక అయ్యింది, అప్పుడనిపించింది బహుశా నేను సాధించింది దీనినేనేమోనని.

55 views0 comments

Recent Posts

See All

Krishnam Vandhe Jagadgurum

ఒక సాయంత్రం. సూర్యాస్తమయానికి కొన్ని నిముషాల ముందు. మనసు బాగలేక అలా నడుచుకుంటూ ఊరి బయట ఉన్న వంక దగ్గరికి వచ్చాను. ఒక పక్క అరటి చెట్లు,...

వదలనిదే నీ స్వార్థం కనపడునా పరమార్థం..

ఒకరోజు ఒక తీగ వచ్చి చెట్టు ని ఇలా అడిగింది, నేను ఎదగడానికి సహాయం చేస్తావా అని, ఆ చెట్టు సంతోషంగా ఒప్పుకుంది. అతి తక్కువ కాలంలోనే ఆ తీగ...

Teaching..

Recently I visited a government school as part of Books and Stationary donation to the students. After books donation I went to a class...

Comments


bottom of page