"ఇంట గెలిచి రచ్చ గెలువు" అనే సామెత ఎవరు రాసారో కానీ చాలా తప్పు సామెత..
ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం గెలిచినా, మన ఇంటిని మాత్రం ఎప్పుడూ గెలవలేము, ఆలా ఇంటిని గెలిచాక బయటకు వెళ్దాం అనుకుంటే మాత్రం అక్కడే ఆగిపోవాల్సిందే..
మనం చేసే పని, మన ప్రవర్తన మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య, పిల్లలు వీరిలో ఒక్కరికైనా ఖచ్చితంగా నచ్చవు.
కష్టపడి నాకు నచ్చిన చదువు చదువుకుంటాను, నచ్చిన పని చేసుకుంటాను అంటే నీ తల్లిదండ్రులకు నచ్చదు,
నువ్వు చేసే పని వల్ల నీ చుట్టూ వున్నవారు నిన్ను ఇష్టపడినా, నీ తోబుట్టువులకి నచ్చవు,
నువ్వు సమాజానికి చేసే మంచి వల్ల డబ్బులు ఖర్చు ఐతే నీ భార్యకో, భర్తకో నచ్చదు,
ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే నీ మాటలు, సలహాలు నీ కొడుక్కి, కూతురుకి నచ్చవు..
ఒక్కసారి బాగా అలోచించి ఇది కరెక్ట్ కాదు అనేవాళ్ళు ఎవరైనా వుంటే చెప్పండి..
Comments