ఆరవ తరగతి స్నేహం
అది అరవయ్యేళ్ళకు పదిలం(2)
నువ్వే గీసిన చిత్రం
నీకు నేర్పిన గణితం
స్కూళ్ళో ర్యాంకుల కోసం
పోటీ పడి చదివిన వైనం
నీతో గడిపిన సమయం
నన్నే మరిచిన తరుణం
అన్నీ నాకు జ్ఞాపకం
మళ్ళీ రాదు ఆ క్షణం
ఆరవ తరగతి స్నేహం
అది అరవయ్యేళ్ళకు పదిలం(2)
ఆ విధి చేసెను నేరం
మన మధ్యన పెంచెను దూరం
ఎటువైపో సాగెను పయనం
నీకై ఎదురే చూసెను నయనం
ఆగదు కద మరి కాలం
మళ్ళీ కలిసిన వైనం
ఇదంతా దేవుడు ఆడే నాటకం
మనమంతా అందులో పాత్రలం
ఆరవ తరగతి స్నేహం
అది అరవయ్యేళ్ళకు పదిలం
మనమే కలిసిన ఆ స్థలం
అది విద్యోదయం.. అది విద్యోదయం..
Comments