ఈరోజు పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా ఒక పెద్ద పురుగు కనిపించింది, చాలా భయపడి పోయి కొంచెం దూరంగా జరిగి రెండు అడుగులు ముందుకు వేస్తూనే అలాంటిదే ఇంకో పురుగు కనిపించింది, ఇప్పుడు అది కొంచెం ఎండిపోయిన ఆకు లాగా ఉంది, కొంచెం భయం తగ్గింది. మళ్లీ కొంచెం దూరం జరిగి ఇంకో రెండు అడుగులు ముందుకు వేయగానే అప్పుడే చెట్టు నుంచి రాలుతున్న ఆకు ఒకటి ముందర పడింది, అప్పుడు దాన్ని చూసి ఇది పురుగు కాదు ఆకే అనుకోగానే భయం మొత్తం పోయింది.
అప్పుడనిపించింది జీవితం కూడా ఇంతేనేమో కష్టమొచ్చిన చోటే ఆగిపోతే బాధ పెరుగుతూ ఉంటుంది, దాన్ని దాటి అడుగు ముందుకు వేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది అని.
Comments