అందమంటే కాదురా రంగు, రూపం,
నలుగురికి సహాయపడే తన మనస్సే తన అందం..
అందమంటే కాదురా ఆస్తి, అంతస్థు,
సమస్యను పరిష్కరించే తన మేథస్సు తనకు అందం..
అందమంటే కాదురా కట్టే బట్ట,
వెలకట్టలేని తన అణకువ అమాయకత్వం తనకు అందం..
ప్రేమంటే కాదురా చూపుల్లో ఆకర్షణ,
తన మనస్సును చేరడానికి నా మనస్సు పడే సంఘర్షణ.
コメント