వస్తువుల పట్ల మమకారం,
తోటివారి పట్ల అహంకారం..
కావాలంటాడు అధికారం,
అసలే మరిచినాడు పరోపకారం..
అందరికీ చేస్తుంటాడు నమస్కారం,
ఎవ్వరికీ చెయ్యడు సహకారం..
మంచిని చూడలేని అంధకారం,
మంచిపనికి చెయ్యడు శ్రీకారం..
డబ్బుంటేనే అంటాడు సత్కారం,
లేనేలేదు సంస్కారం..
ఇలాంటోడు సమాజానికి హానికరం,
మారాలంటే కావాలి ఆ దేవుడే సాక్షాత్కారం..
అందుకే నేనంటాను ఈకాలం మనిషి,
మనిషి కాదు మనీషి అని.
Comments